About This Event
Under the joint leadership of Danadharma Charitable Trust and Veda Sankalpa Seva Trust, and under the special guidance and blessings of His Holiness Sri Sri Sri Tridandi Chinna Srimannarayana Ramanuja Jeeyar Swamiji, the Sri Lakshmi Chennakesava Swamy Temple, newly constructed in Kondanagula Village, Balmur Mandal, Achampet Taluka, Nagar Kurnool District, Telangana State, witnessed the grand celebration of the Sri Swamy Vari Vigraha Pratishtha Mahotsavam.
This sacred three-day ceremony was conducted from 07 March 2026 to 09 March 2026, and concluded successfully with great grandeur and devotion.
The entire Mahotsavam was filled with divine spiritual energy, accompanied by the chanting of Vedic hymns, the melodious sounds of mangala vadyams, blessings from revered Acharyas, and the deep devotion of numerous devotees.
A large number of devotees attended the Mahotsavam and received the divine darshan of Sri Lakshmi Chennakesava Swamy, experiencing immense spiritual joy and blessings.
We sincerely pray that the infinite grace and blessings of Sri Swamy continue to shower upon all devotees and bless the world with peace, prosperity, and well-being. 🙏
On behalf of Danadharma Charitable Trust, we express our heartfelt gratitude to all the devotees who attended this sacred event and made the Mahotsavam a grand success with their presence and support.
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ & వేద సంకల్ప సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో, పరమపూజ్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యేక పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట తాలూకా, బల్మూర్ మండలం, కొండనాగుల గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో 07-March-2026 నుండి 09-March-2026 వరకు మూడు రోజులపాటు నిర్వహించిన శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసినది. వేద ఘోషలు, మంగళ వాద్యాల నాదం, ఆచార్యుల ఆశీర్వచనాలు మరియు భక్తుల భక్తి భావాలతో ఈ పవిత్ర మహోత్సవం ఆధ్యాత్మిక మహిమతో నిండిపోయింది. ఈ మహోత్సవానికి అనేకమంది భక్తులు హాజరై శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దివ్య దర్శనం చేసుకొని అపారమైన ఆనందాన్ని పొందారు. స్వామివారి అనంత కృపాకటాక్షాలు భక్తులందరిపై ఎల్లప్పుడూ ప్రసన్నంగా నిలిచి, సర్వలోకాలకు శాంతి, శుభం, సౌభాగ్యాలను ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము. 🙏 ఈ మహోన్నత ధార్మిక కార్యక్రమానికి విచ్చేసి, తమ సాన్నిధ్యంతో మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.












Event Details
Wednesday, March 11, 2026
Kondanagula Village, Balmur Mandal, Achampet Taluka, Nagar Kurnool District, Telangana
Support Village Temples
Completed

