About This Event
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలం, పెద్ద గడేహోతూరు గ్రామపంచాయతీ పరిధిలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో నిర్మించిన నూతన ఆలయంలో... శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా పూర్తయింది.
ఈ ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట మరియు అన్న సమారాధన కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు దాతలకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము.
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే వివరాలకు 6305952517 (దానధర్మ ట్రస్ట్) ను సంప్రదించగలరు
Event Details
Friday, November 7, 2025
Pedda Gadehotur Gram Panchayat, Vajrakarur Mandal, Anantapur District, Andhra Pradesh
Support Village Temples
Completed


