About This Event
వందల సంవత్సరాల నాటి ఈ కాలభైరవస్వామి వారు నెల్లూరులో ఉన్న ఇప్పటి భక్తులకు అనేక మందికి తెలియకపోవచ్చు. గుప్తనిధుల కోసం పరమపవిత్రమైన ఈ ప్రదేశాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఏ గతి పట్టారో ఆ పైవాడి కెరుక.
ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు ఎంతో దివ్యమైన ముహూర్తం. ఈ సందర్భంలో భైరవుడుకి అభిషేకం చేసుకోవడం వలన వారి అనుగ్రహం సంపూర్ణంగా వర్షిస్తుంది అని చెప్పుకోవాలి. కలియుగంలో కాలభైరవుడుకి, వీరభద్రుడుకి ఎవరూ సాటిరారు.వీరిని ఆరాధించే వారి మీద గ్రహాలూ, శక్తులూ ఏమీ పనిచేయవు. కర్మఫలాన్ని కూడా తొందరగా ముగింపచేసి ఇహం పరం రెండూ అనుగ్రహించి తరింపచేస్తారు.సమర్థవంతమైన దేవతా స్వరూపాలు వీరిరువురూ.ఉత్కృష్టమైన రూపాలలో భైరవునికీ,వీరభద్రుడుకి ఎవరూ సాటిరారు.ఈశ్వరుని అఘోరతత్వం నుండి కార్యార్థమై వచ్చిన ఈ అవతారాలు శాశ్వతంగా సృష్టిలో దేవతా శక్తులలో నిలిచిపోయాయి.
ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇలాంటి అలంకారాన్ని ఏరికోరి చేయించుకున్నాడేమో ఈ భైరవుడు అనిపించింది.
అర్దం చేసుకున్న వారికి అర్ధమైనంత
Event Details
Date & Time
Friday, November 12, 2021
TEvent Type
Other
SStatus
Completed


